అమ్మకానికి ఎన్‌డిటీవీ

0
50

అజయ్‌ సింగ్‌తో బేరాలు?
మార్కెట్లో జోరుగా వార్తలు
పెరిగిన షేరు ధర.. ఖండించిన సంస్థ
న్యూఢిల్లీ: ప్రముఖ టెలివిజన్‌ మీడియా సంస్థ ఎన్‌డి టీవీని స్పైస్‌జెట్‌ అధినేత అజయ్‌సింగ్‌ కొనుగోలు చేయనున్నట్టుగా వచ్చిన వార్తలు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. డీల్‌ దాదాపు ఖరారైనట్టు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఎన్‌డిటీవీ ఖండించింది. ఈ మేరకు బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బిఎ్‌స)ఇకి ఒక నోట్‌ కూడా పంపింది. అయితే ఈ వార్తల కారణంగా బిఎ్‌సఇలో ఎన్‌డిటీవీ షేరు ధర 5 శాతం లాభపడింది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం డీల్‌ తర్వాత ఎన్‌డిటీవీలో అజయ్‌సింగ్‌కు 40 శాతం వాటా ఉంటుందని, సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్‌రాయ్‌, రాధికారాయ్‌లకు 20 శాతం వాటా ఉంటుందని తెలిసింది. వాస్తవానికి ఎన్‌డిటీవీ తీవ్ర నష్టాల్లో ఉంది.

గత పదేళ్లుగా ఈ సంస్థ లాభాలను కళ్లజూడలేదు. పేరుకుపోయిన నష్టాల మొత్తం 1,474 కోట్ల రూపాయలుంటుందని అంచనా. మరోవైపు, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, స్వతంత్ర వ్యవహారశైలి కారణంగా ఎన్‌డి ్డటీవీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా వార్తలున్నాయి. ఎన్‌డిటీవీ సంపాదకుల్లో కొందరు ప్రభుత్వ విధానాలు, మతరాజకీయలపై విమర్శనాత్మకంగా ఉండటం ఈ ఇబ్బందులకు కారణమని అంటారు.

ప్రణయ్‌రాయ్‌పై సిబిఐ దర్యాప్లు కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా సంస్థనే విక్రయించే అవకాశం ఉందన్న వార్తలు రావడం మీడియావర్గాల్లో సంచలనం కలిగించింది. పైగా ఎన్‌డిటీవీని కొనుగోలు చేయనున్న అజయ్‌సింగ్‌ బిజెపికి చాలా సన్నిహితుడు. ప్రధాని మోదీ ఆంతరంగికుల్లో ఒకరని పేరు. ఇప్పటికే దేశంలో అత్యధిక శాతం మీడియాను ప్రభుత్వం తనవైపు తిప్పుకుంది. అతి తక్కువ సంఖ్యలో పత్రికలు, టీవీ చానళ్లు, మేగజైన్లు ప్రభుత్వ విధానాలపట్ల విమర్శనాత్మకంగా ఉన్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here