అయోధ్యలో భారీ రాముడి విగ్రహం!

0
53

లఖ్‌నవూ, అక్టోబరు 10: అయోధ్యలో సరయు నది ఒడ్డున భారీ రాముడి విగ్రహం ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. 100 అడుగు ఎత్తులో, రూ. 300 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. రాముడి విగ్రహంపై ఇప్పటికే గవర్నర్‌ రామ్‌నాయక్‌కు యూపీ పర్యాటకశాఖ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అయోధ్య అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, మత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే యోది ఆదిత్యనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆమోదం లభించిన తర్వాతే విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి అవనీశ్‌ అస్వాథి తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here