ఇంగ్లీష్‌ మేడ్‌ ఈజీ

0
50

భాషను నేర్చుకోవాలంటే గ్రామర్‌ తప్పనిసరా! అంటే…. చాలా మంది అవును అనే
సమాధానం చెపుతారు. కానీ దాని అవసరం లేకుండానే నేర్పిస్తామంటోంది ‘కరడిపాత్‌’. ఇంగ్లీషు సహా ఏ భాష నేర్చుకోవడానికి కూడా గ్రామర్‌ అక్కర్లేదు అనేది ఈ సంస్థ భావం. ఆ ఆలోచనతోనే సంప్రదాయ పద్ధతికి భిన్నంగా లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లీషు బోధించే పనిలో ఉంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా దాదాపు మూడు వేల పాఠశాలల్లో ఐదు లక్షల మంది విద్యార్థులకు సంప్రదాయేతర పద్ధతిలో ఇంగ్లీషు బోధిస్తోంది.

డిజైనింగ్‌ భిన్నంగా ఉంటుంది. ఇది మొత్తం రెండు సంవత్సరాల ప్రోగ్రామ్‌. లెవల్‌ -1, లెవల్‌-2గా విభజించారు. ఒక్కో లెవల్‌ 72 గంటల సేపు ఉండేలా డిజైన్‌ చేశారు. టోటల్‌గా 144 గంటల ప్రోగ్రామ్‌. ఇందులోనే విద్యార్థులు పట్టు సంపాదించేలా డిజైన్‌ చేశారు. కరడిపాత్‌ ఒక్క క్లాసు 11 సంప్రదాయ ఇంగ్లీషు క్లాసులతో సమానం అని వారు గర్వంగా చెప్పుకొంటారు.

ఈ కథ సరిగ్గా 21 ఏళ్ళ క్రితం మొదలైంది. విశ్వనాథ్‌, శోభా విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో కరడిటేల్స్‌ శ్రీకారం చుట్టుకుంది. నిజానికి కథలు లేని భాష ఉండదంటే అతిశయోక్తికాదు. మానవుడికి భాష తెలిసినప్పటి నుంచి ఈ కథలు ఉన్నాయి. టెక్నాలజీ పెరిగాక కథల ఫార్మాట్‌ మారింది. కాన్పెప్ట్‌ మాత్రం మారలేదు. కరడిటేల్స్‌ కూడా ఈ పద్ధతినే అనుసరించింది. తొలుత ఆడియో బుక్స్‌, స్టోరీబుక్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటికి విపరీతమైన ఆదరణ లభించింది. ఈ స్టోరీలు చదివిన చురుకైన విద్యార్థులు కొందరు ఇంగ్లీషులో కూడా కొంతమేర పట్టు సంపాదించారు. దాంతో ‘మీరే లాంగ్వేజ్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌ను ఎందుకు మొదలు ప్రారంభించకూడదు’ అని కొన్ని స్కూల్స్‌, తల్లిదండ్రులు వారిని అడిగారు. అలా మొదలైన ఆలోచనే ‘కరడిపాత్‌’ ఏర్పాటుకు దారి తీసింది. సంప్రదాయేతర పద్ధతిలో విద్యార్థులకు ఎలా బోధన చేయాలో కొంత పరిశోధన చేసి దీనిని రూపొందించారు.

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒకే భాష మాట్లాడుతారు. కానీ భారతదేశం అందుకు భిన్నం. మన దగ్గర వందల సంఖ్యలో భాషలు ఉన్నాయి. మన దేశ పౌరుల్లో ఎక్కువ మంది కనీసం రెండుమూడు భాషలను అలవోకగా మాట్లాడేస్తారు. అయితే ఇంత దూకుడుగా ఉండే వ్యక్తులు కూడా ఇంగ్లీషు విషయానికి వచ్చేసరికి మాత్రం వెనకంజ వేస్తారు. ఇంగ్లీషుపై ఉన్న భయాన్ని పోగొట్టగలిగితే చాలు, సులువుగా ఆ భాషను నేర్పించవచ్చని కరడిపాత్‌ భావించింది. స్థానిక భాషలను ఇంటి దగ్గరే ఎలా నేర్చుకోగలిగారో అదే విధానాన్ని అనుసరిస్తే ఇంగ్లీషు మాట్లాడడం కూడా సులువే. ఈ పద్ధతిని స్కూల్స్‌లో అమలు చేస్తోంది ‘కరడిపాత్‌’.

బోధన ప్రత్యేకం
ప్రతీ భాష అమరిక ఒక్కో తీరుగా ఉంటుంది. మాతృ భాషను నేర్చుకోవడానికి మరో భాషను ఉపయోగించం. అలాగే వేరే భాషను నేర్చుకోవడానికి మాతృభాషను మాత్రం ఎందుకు ఉపయోగించుకోవాలి అంటారు కరడిపాత్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ విశ్వనాథ్‌. ‘‘మా క్లాసులో పిల్లలను ఎక్కడ కూడా నీకు అర్థం అయిందా అని అడగం. స్టోరీ, యాక్షన్‌, మ్యూజిక్‌ ద్వారా వారే అర్థం చేసుకునేలా బోధిస్తాం. అంటే కథలను, జనరల్‌ నాలెడ్జి విషయాలను మ్యూజిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడియో ద్వారా యాక్షన్‌ చేస్తూ పిల్లలకు వినిపిస్తాం. దానిని వారితో మళ్లీ రైమింగ్‌గా చెప్పిస్తాం. ఫలితంగా వారు జీవిత కాలంలో దీనిని మర్చిపోరని అంటారు’’ ఆయన. ఇంగ్లీషు క్లాస్‌ అంటేనే చాలా మంది పిల్లల్లో ఒక రకమైన భయం ఉంటుంది. అందుకే వీరి శిక్షణకు క్లాసు అనే పేరు పెట్టరు. కానీ ఆక్కడ జనరల్‌ నాలెడ్జ్‌ సహా చాలా విషయాలు ఇంగ్లీషు మాధ్యమంగా బోధిస్తుంటారు. దీని ద్వారా చాలా విషయాలను విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. అంతేకాదు ఆడియో బుక్స్‌ కాన్సె్‌ప్టను కరడిపాత్‌ ఐదేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తోంది. నేర్చుకోవడంలో విజువలైజేషన్‌, మ్యూజిక్‌ ప్రధాన పాత్ర వహిస్తాయని వీరి భావం. ‘‘ఎంత పెద్ద హర్రర్‌ సినిమా అయినప్పటికీ మ్యూజిక్‌ లేకుండా చూస్తే ఎలాంటి భావాలూ కలగవు. అదే కాన్పెప్ట్‌ చదువుకూ వర్తిస్తుందని’’ అంటారు విశ్వనాథ్‌. ఒక సోర్టీ లేదా మరే విషయం అయినా పిల్లవాడికి మ్యూజిక్‌ ద్వారా చెబితే మిగిలినది తనే ఊహించుకుంటాడు. దీని వల్ల వారిలో క్రియేటివిటీ పెరుగుతుందని చెబుతారు ఆయన. ప్రకృతిని గీయమని పిల్లవాడికి చెబితే వాడు తన ఆలోచనల ఆధారంగా బొమ్మలు గీస్తాడు, రంగులు వేస్తాడు. దీని వల్ల విద్యార్థుల ఆలోచనా పరిధి పెరుగుతుంది. కానీ మనమే ఒక బొమ్మను ఇచ్చి గీయమంటే కాపీ చేయడం తప్ప వారు నేర్చుకునేది ఏముంటుందని ప్రశ్నిస్తారు ఆయన.

మూడు వేల పాఠశాలల్లో….
తొలుత స్వచ్ఛంధ సంస్థలతో కలిసి పనిచేసే సమయంలో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఆసక్తికల ప్రభుత్వ అధికారులు వీరిని సంప్రదించారు. అలా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్స్‌తో ఒప్పందం కుదరడంతో వీరి భాగస్వామ్యం మొదలైంది. ప్రవీణ్‌కుమార్‌లాంటి పులువురి చొరవ కారణంగా తెలంగాణలో దాదాపు ఐదారు వందల పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. అలాగే ఇతర ప్రాంతాల్లో సక్సె్‌సను చూసిన తరవాత తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కరడిపాత్‌తో ఒప్పందం కుదర్చుకుంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 900 పాఠశాలల్లో ఈరకమైన బోధన ప్రారంభం అయింది. అలా ఒకటి ఒకటిగా విస్తరిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న 13 రాష్ట్రాలోని మూడువేల స్కూల్స్‌లో ఈ విధానం ద్వారా ఇంగ్లీషును నేర్పిస్తున్నారు. ఇందులో సిబిఎ్‌సఇ, ఐసిఎ్‌సఇ, స్టేట్‌ సిలబ్‌సను అనుసరిస్తున్న స్కూల్స్‌ కూడా ఉండడం విశేషం.

విధానం మారాలి
క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఏదైనా విషయం చెప్పాలంటే టీచరే మొదటి స్టూడెంట్‌గా మారాలి. అప్పుడే బోధన అనేది సాధ్యం. క్లాసులో పిల్లలను ప్రోత్సహించాలి. పాఠంలో భాగస్వాములను చేయాలి. అలాంటప్పుడు విద్యార్థి ఉత్సాహంగా ఇన్వాల్వ్‌ అవుతాడు. ఉపాధ్యాయుడు ఏమి చేస్తున్నాడో దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. టీచర్‌ కనక తరగతిలో సీరియ్‌సగా పాఠం చెపితే వారు అంతే సీరియ్‌సగా ఉంటారు. బెత్తం తీసుకుని భయపెడితే ఏ క్లాసులోనూ చదువు రాదు. అందుకే పిల్లలను ఆకర్షించాలంటే నవ్వు ప్రధానం. అందుకే ఈ విధానంలో ముందుకు వెళుతోంది కరడిపాత్‌.

యాక్షన్‌, మ్యూజిక్‌, స్టోరీ కాన్సెప్టుల ఆధారంగా ఇంగ్లీషు బోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూల్స్‌లో ‘కరడిపాత్‌’ ప్రోగ్రామ్‌ను ఐదో తరగతి నుంచి మొదలు అవుతుంది. ట్రైబల్‌ వెల్పేర్‌లోని మిని గురుకులమ్‌లో అయితే ఫస్ట్‌క్లాస్‌ నుంచి మొదలు అవుతుంది. వీరికి బిగినర్‌ ప్రోగ్రామ్‌ ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు స్కూల్స్‌ వరకే ఉన్న ఈ ప్రోగ్రామ్‌ను కాలేజీలకు విస్తరిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి మంచిర్యాల జూనియర్‌ కాలేజీలో ఈ విధానం అమలు కాబోతోంది. కాలేజ్‌, స్కూల్‌ ఏదైనా సరే యాక్షన్‌, మ్యూజిక్‌, స్టోరీ – ఇలానే బోధన సాగుతుంది. అయితే ఆ వయస్సుకు అనుగుణంగా స్టోరీలు ఉంటాయి. అంతేకాదు క్లాస్‌ రూమ్‌లను కూడా కరడిపాత్‌ బృందం తరచుగా విజిట్‌ చేస్తుంది. మెటీరియల్‌ని అందించడంతోపాటు ఈ సంస్థ కో ఆర్డినేటర్లు ప్రతీ రోజు రెండు పాఠశాలలను సందర్శిస్తారు. తాజా అప్‌డేట్స్‌పై టీచింగ్‌ ఫ్యాకల్టీలకు అవగాహన కల్పిస్తారు, సిలబ్‌సకు అనుగుణంగా గైడ్‌ చేస్తుంటారు.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here