ఎయిమ్స్‌.. చకచకా

0
42

మూడు దశలుగా నిర్మాణ పనులు
జనవరిలో రెండోదశ పనులు
మూడోదశలో ఎక్విప్‌మెంట్‌
రూ.14 కోట్లతో కృష్ణా జలాలు
హైవే నుంచి త్వరితగతిన 100 అడుగుల రోడ్డు
వివిధ శాఖల అధికారులతో మంత్రి కామినేని సమీక్ష

‘ఎయిమ్స్‌ పనులు బ్ర హ్మాండంగా జరుగుతున్నాయి. నేను వూహించినదాని కన్నా వేగంగా జరుగుతున్నాయి.. ఇక్కడకు వచ్చి చూశాక నాకు చాల చాల సంతృప్తిగాను, మ రెంతో ఉత్సాహంగాను ఉంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. మంగళగిరి కొం డల నడుమ 193 ఎక రాల విస్తీర్ణంలో చేపట్టిన అఖిల భారత వైద్య విజ్ఞా న సంస్థ (ఎయి మ్స్‌) ని ర్మాణ పనులను బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌తో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు.

మంగళగిరి: ఎయిమ్స్‌ పనులను మూడు దశలుగా చేపట్టినట్టు మంత్రి కామినేని తెలిపారు.. మొదటి రెండు దశలు భవన నిర్మాణాలకు చెందినవే!. ఎయిమ్స్‌ ప్రాంగణంలో తూర్పుదిశగా హస్పిటాలిటీ, ఇన్‌స్టిట్యూషన్‌ భవనాలు వస్తుండగా… పశ్చిమ ప్రాంగణంలో పూర్తిగా నివాసిత, హస్టల్‌ భవన సముదాయాలు వుండేవిధంగా మాస్టార్‌ ప్లాన్‌లో నిర్దేశించాం. తొలిదశ కింద నివాసిత, హస్టల్‌ భవనాలతోపాటు హాస్పిటాలిటీకి చెందిన అతి ప్రధానమైన అవుట్‌ పేషెంట్‌ డిపార్టుమెంట్‌ (ఓపీడీ) బ్లాకును నిర్మిస్తున్నాం. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఈ పనుల్లో ఇప్పటికే ఎంతో పురోగతి కనిపిస్తోందని మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికల్లా తొలిదశ నిర్మాణాలన్నీ పూర్తవుతాయి. రెండోదశ పనులకు సంబంధించి మరో నెల రోజుల్లోగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి జనవరి కల్లా పనులను ఆరంభించేలా కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ రెండోదశలో పూర్తిగా ఆసుపత్రి, వైద్య కళాశాల భవనాలే వుంటాయని కామినేని తెలిపారు. ఇక మూడో దశలో ఎక్విప్‌మెంట్‌, ఫర్నిచర్‌లను ఏర్పాటుచేసుకునేలా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కాగా, 2018లో ఎయిమ్స్‌ వైద్య కళాశాలలో అడ్మిషన్లను ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

వివిధ శాఖల వారీగా సమస్యలపై సమీక్ష
అంతకుముందు మంత్రి కామినేని అటవీ, విద్యుత్‌, రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ, ప్రజారోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, సీఆర్‌డీఏ అధికారులతో ఎయిమ్స్‌ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ ఆసుపత్రికి ఒప్పందం ప్రకారం రాష్ట్రప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి శాఖల వారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఆయా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి..

కృష్ణా జలాలకు రూ.14 కోట్లు కావాలి
ఎయిమ్స్‌ ప్రాంగణానికి కృష్ణా జలాలను సరఫరా చేసే పథకాన్ని గురించి మంత్రి కామినేని జిల్లా ప్రజారోగ్యశాఖ అధికారులను విచారించారు. ఉండవల్లిలోని కృష్ణాతీరం నుంచి ఎయిమ్స్‌ వరకు 12.3 కిలోమీటర్ల పొడవున పైప్‌లైను, ఇంటెక్‌వెల్‌, సంపును నిర్మించేందుకు రూ.14 కోట్లు ఖర్చవుతాయని అంచనాలను రూపొందించినట్టు ఆ శాఖ ఈఈ టి.సంపత్‌కుమార్‌ వివిరించారు. రోజుకు 2.5 ఎంఎల్‌డీ నీటిని ఈ పథకం రూపేణా సరఫరా చేయొచ్చునని ఆయన తెలిపారు. ఇలా సరఫరా చేసిన రావాటర్‌ను శుద్ధిచేసి పంపిణీ చేసేందుకు అవసరమైన ట్రీట్‌మెంటు ప్లాంటు, డిస్ట్రిబ్యూటరీ లైన్లను ఎయిమ్స్‌ నిర్మాణ పర్యవేక్షణ ఏజెన్సీ హెచ్‌ఎస్‌సీసీ చూసుకుంటుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి రూ.14 కోట్లు మంజూరు చేయిస్తామని మంత్రి చెప్పారు.

సంక్లిష్టంగా 100 అడుగుల రోడ్డు
16వ నెంబరు జాతీయ రహదారి నుంచి తూర్పుదిశగా ఎయిమ్స్‌లోకి 100 అడుగుల రహదారిని నిర్మించే పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రి కామినేని ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ మాధవీ సుకన్యను ప్రశ్నించారు. హైవే నుంచి 1.6 కిలోమీడర్ల పొడవున ఈ రోడ్డును నిర్మించాల్సి వుందని… ప్రస్తుతం ఏపీఎస్పీ, ఎయిమ్స్‌ అధికారులు కలిసి 0.5 కిలోమీటర్ల నిడివి కల స్థలాన్ని తమకు అప్పగించారని… ఇంకా 1.1 కిలోమీటర్ల నిడివికల రోడ్డుమార్గం కోసం 0.941 హెక్టార్ల అటవీ స్థలాన్ని డీ రిజర్వు చేసి తమకు అప్పగించాల్సి వుందని తెలిపారు. ఇందుకోసం అటవీశాఖ రూ.18.89 లక్షలను చెల్లించాలని కోరగా ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిపారు. సొమ్ము చెల్లింపుపై అండర్‌ టేకింగ్‌ తీసుకుని సత్వరమే స్థలాన్ని ఆర్‌ అండ్‌ బీకి అప్పగించాలని మంత్రి అటవీ అధికారులను కోరగా నిబంధనలు అంగీకరించవని తేల్చిచెప్పారు. దీంతో ఆ రెండుశాఖల ముఖ్య కార్యదర్శులతో మంత్రి కామినేని ఫోన్‌లో మాట్లాడారు. 100 అడుగుల రోడ్డును ఎప్పటిలోగా నిర్మించగలరని కలెక్టర్‌ శశిధర్‌ ప్రశ్నించగా ఏడాది సమయం పట్టవచ్చునని ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ మాధవీ సుకన్య చెప్పారు. అంత సమయమా అంటూ మంత్రి సహా ఆశ్చర్యపోయారు. 1.6 కి.మీ. రహదారికి అంతసమయమెందుకని కలెక్టర్‌ ప్రశ్నించారు.

మొన్నేసిన ఆ టవర్లు తీయాల్సిందే!
100 అడుగుల రహదారికి మరో అడ్డంకి కూడ వుందంటూ ఆర్‌ అండ్‌ బీ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం హైవే నుంచి ఎయిమ్స్‌ ప్రాంగణంలోకి వస్తున్న హెచ్‌టీ విద్యుత్‌ లైన్‌ టవర్లు రోడ్డు మధ్యకు వస్తున్నాయని… వాటిని పక్కకు మరల్చేందుకు ఏపీఎస్పీడీసీయల్‌ అధికారులు రూ.82 లక్షలు చెల్లించాలని కోరుతున్నారని ఎస్‌ఈ చెప్పారు. సేవాపన్ను చెల్లింపుతో కలిపి ఈ మొత్తం రూ కోటిని చేరుకుందని… నిధుల చెల్లింపునకై ఉన్నతాధికారులకు నివేదించామని వివరించారు. ఈ నిధులను కూడ వెంటనే మంజూరు చేయిస్తామని మంత్రి కామినేని చెప్పారు.

132 కేవీ సబ్‌స్టేషన్‌ ఇలా..
ఎయిమ్స్‌లో విద్యుత్‌ అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా నిర్మించదలిచిన 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ గురించి మంత్రి ఆ శాఖాధికారులను విచారించారు. సబ్‌స్టేషన్‌ కోసం 0.99 హెక్టారుల అటవీ స్థలాన్ని డీరిజర్వు చేసి తమకు అప్పగించాల్సి వుందని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ బి.జయభరత్‌రావు వివరించారు. ఇందుకుగాను అటవీశాఖ రూ.8.19 లక్షలను చెల్లించాలని కోరినట్టు చెబుతూ త్వరలోనే ఆ మొత్తాన్ని చెల్లించగలమని వివరించారు. కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, కేఎంవీ ప్రాజెక్టు సంస్థ ఎండీ కనకమేడల మల్లేశ్వర వరప్రసాద్‌, మంగళగిరి, తాడేపల్లి తహసీల్దార్లు సంగా విజయలక్ష్మి, పద్మనాభుడు, ప్రజారోగ్యశాఖ డీఈఈ ఎన్‌.గోవిందయ్య,, ఏఈఈ జి.శ్రీనివాసరావు, ఆర్‌ అండ్‌ బీ డీఈఈ వి.భవానీశంకర్‌, విద్యుత్‌శాఖ ఈఈ ఎన్‌.పిచ్చియ్య, ఏడీఈ జి.భాస్కరరావు, ఏఈ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మారుతున్న డిజైన్లు
ఇదిలావుండగా ఎయిమ్స్‌ భవన నిర్మాణాల కోసం ప్రతిపాదించిన డిజైన్లు తరచుగా మారిపోతున్నాయి. తాజాగా హస్పిటాలిటీకి చెందిన ఓపిడి బ్లాకును అయిదంతస్తుల నుంచి ఏడంతస్తులకు మార్చారు. ప్రాంగణంలో సదరు స్థలం పల్లంగా వున్నందున దాని ఎత్తు పెంచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ భవంతిలో మొదటి రెండు ఫ్లోర్‌లను సెల్లార్‌లుగా వాడాలని నిర్ణయించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here