ఓ పాప కథ

0
45

అటు పేగు బంధం.. ఇటు పెంచిన మమకారం
కూతురి కోసం అమ్మల పోరు… ఎటూ తేలని సాన్విత భవితవ్యం
ఇల్లెందు, ఖమ్మం కమాన్‌బజార్‌ అక్టోబరు 24: బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఒక వైపు.. రెండున్నరేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుతున్న తల్లి మరోవైపు. ఇద్దరి మధ్య ఆ చిన్నారి రోదించిన తీరు కన్నీరు పెట్టించింది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చినకిష్టాపురానికి చెందిన మాలోత్‌ ఉమ, బాల్య దంపతులకు 2010లో వివాహమైంది. వీరు ఇల్లెందు పట్టణానికి వలస వచ్చారు. 2013లో మొదటి సంతానంగా ఆడపిల్ల, 2015లో మరో ఆడపిల్లకు ఉమ జన్మనిచ్చింది. పేదరికంలో మగ్గుతున్న తాము ఇద్దరు ఆడపిల్లలను పోషించలేమని భావించిన బాల్య.. ఆర్‌ఎంపీ ఎ.శ్రీనివాసరావు ద్వారా సింగరేణి ఉద్యోగి రాజేంద్రప్రసాద్‌కు పాపను విక్రయించారు. ఉమకు సీజేరియన్‌ జరగడంతో ఆమె రెండు రోజులపాటు స్పృహలోకి రాలేదు. పురిటిలోనే బిడ్డ చనిపోయిందంటూ బాల్య చెప్పడంతో కొద్దిరోజులపాటు రోదించిన ఉమ.. తర్వాత మర్చిపోయింది. మరోవైపు.. రెండున్నరేళ్లుగా రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో పెరుగుతున్న బిడ్డకు సాన్వితగా నామకరణం చేశారు. గత నెలలో ఇల్లెందులోని స్టేషన్‌బస్తీలో నివాసమంటున్న బంధువుల ఇంటికి వచ్చిన ఉమను కొందరు స్థానికులు ‘పాపను మీరే దత్తత ఇచ్చారట కదా?’ అంటూ ప్రశ్నించారు. అవాక్కయిన ఉమ.. భర్తను నిలదీసింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి తమ బిడ్డను ఇవ్వాలంటూ కోరగా వారు నిరాకరించారు. అక్టోబర్‌ 21న పోలీసులకు ఉమ ఫిర్యాదు చేశారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో వెలుగులోకి..
ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతాన్ని ‘ఆడపిల్ల పుట్టిందని అమ్మేశాడు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఈక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీవో దయామణి.. సాన్వితను పెంచుతున్న కుటుంబ సభ్యులను, జన్మనిచ్చిన కుటుంబ సభ్యులను విచారించి బాలిక సాన్వితను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. బాల్య, రాజేంద్రప్రసాద్‌, ఏఎ్‌సరావుపై కేసు నమోదు చేశారు. జువైనల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం బిడ్డకు న్యాయం చేస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఎం.ఎల్‌.ప్రసాద్‌ చెప్పారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here