కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. రూ. కోటి సొంతం చేసుకోండి!

0
45

కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. వచ్చే నెల ప్రకటించే అవకాశం
న్యూఢిల్లీ: బినామీ ఆస్తుల గుట్టు విప్పేందుకు ప్రజలే ముందుకు రావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని పెట్టబోతోంది. ఈ పథకం కింద బినామీ ఆస్తుల సమాచారం ఇచ్చిన వాళ్లకు ఆస్తి విలువను బట్టి కనీసం రూ.15 లక్షలు, గరిష్ఠంగా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తారు. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్(సీబీడీటీ) ఉన్నతాధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. బినామీ ఆస్తుల జాడ చెప్పిన వారి సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారు. వారి ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటారు. వచ్చే నెలలో పథకాన్ని ప్రకటిస్తారు. గత ఏడాది నవంబరు 1 నుంచి బినామీ ఆస్తుల నిషేధ చట్టం-2016 అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్దతుల్లో బినామీ ఆస్తుల్ని పసిగట్టడం చాలా కష్టంగా ఉంటోంది. ఇన్ఫార్మర్ల సాయంతో పని చేయడం తేలిగ్గా ఉంటుందని, వేగంగా, సమర్థంగా కదిలి బినామీల బండారం బయట పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here