నవ యౌవన ఆహారం

0
49

ముఖంలో కాస్త వయసు కనపడితే చాలు చాలామంది నిస్పృహకు లోనవుతుంటారు. కొందరైతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు కూడా. అలా కాకుండా నవయౌవనులుగా కనిపించాలంటే కొన్ని యాంటి-ఏజింగ్‌ డైట్స్‌ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. అవేమిటంటే..

బ్లూబెర్రీలు తింటే నాజూగ్గా కనిపిస్తారు. వయసు తెలియదు. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు వల్ల వయసుతో వచ్చే శారీరక, మానసిక మార్పులను సులభంగా అధిగమించగలరు.
చిలకడదుంప, కేరట్‌, గుమ్మడి కాయల్లో బెటా-కెరొటెనె అధికం. ఇవి ఏజింగ్‌ను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. చర్మాన్ని పట్టులా ఉంచడంతో పాటు కళ్లకు ఆరోగ్యకరమైన మెరుపునిస్తాయి.
ఆకుకూరలు తినడం వల్ల చర్మం మెరవడమే కాదు వయసు కనపడదు.
విటమిన్‌-సి పుష్కలంగా ఉన్న బ్రొకెల్లీ తింటే చర్మం ముడతలు పడదు. వయసుతోపాటు వచ్చే చర్మం పొడారిపోయే గుణం కూడా పోతుంది.
ట్యున, సాల్మన్‌ చేపలు యాంటి-ఏజింగ్‌గా బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల యవ్వనంతో ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు.
ఆలివ్‌ నూనె వాడితే యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా ఉంటారు. చర్మం, శిరోజాలు మెరుస్తుంటాయి.
కీర కూడా యాంటి ఏజింగ్‌ ఫుడ్‌. ఇందులో నీరు బాగా ఉండడం వల్ల యంగ్‌ లుక్స్‌ పోవు. చర్మంపై ముడతలు పడవు.
నీరు పుష్కలంగా ఉండే పుచ్చకాయలో యాంటాక్సిడెంట్లు ఎక్కువ ఉండడంతో నవయవ్వనులుగా కనిపిస్తారు. యూత్‌లా ఫీలవుతారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here