నేడు సీఎం సచివాలయ ప్రవేశం

0
100

నేడు సీఎం సచివాలయ ప్రవేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 8.39 గంటలకు తన చాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు, నవరత్నాల అమలు గురించి చర్చించే అవకాశం ఉంది. అవినీతి రహిత, పారదర్శక పాలన దిశగా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. ఈ సమావేశం అనంతరం సచివాలయం సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసి అభినందనలు తెలుపుతారు. ఈ కార్యక్రమం ముగిశాక సమయం ఉంటే ఉద్యోగ సంఘాలు, సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి జగన్‌ ప్రసంగిస్తారని జీఏడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకార వేదికకు జగన్‌ చేరుకుంటారు.