నోటిఫికేషన్‌ ప్లీజ్‌!

0
39

ఆర్థిక శాఖ క్లియరెన్స్‌లే ఆలస్యం
అవి రాగానే కొత్త కొలువులు
శాఖల నుంచి అందని ఖాళీల లెక్క
అందిన వాటికీ రాని అనుమతి
క్యాలెండర్‌ మార్చక తప్పదంటున్న ఏపీపీఎస్సీ

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కొత్త ఉద్యోగాలు ‘క్లియరెన్స్‌’ లెక్కల్లో చిక్కుకున్నాయి. వరుస నోటిఫికేషన్లతో నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైన ఏపీపీఎస్సీ ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించుకున్నప్పటికీ… కొలువుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రభుత్వం దాదాపు 20 వేల పోస్టులు భర్తీ చేసింది. వీటిలో… ప్రధానంగా 9వేలమంది టీచర్లను నియమించింది. పోలీసు శాఖలో 6వేల ఉద్యోగాలు ఇచ్చింది. ఇతర ఇతర ప్రభుత్వ విభాగాల్లో మరో నాలుగు వేల వరకు పోస్టులను భర్తీ చేసింది. ఏపీపీఎస్సీ 34 నోటిఫికేషన్ల ద్వారా 4,275 పోస్టులను భర్తీ చేయాలని సంకల్పించింది. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 1500 పోస్టులను భర్తీ చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించగా.. మరి కొన్నింటి ఫలితాల విడుదల పెండింగ్‌లో ఉంది. ఇంకొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here