ప్రచార బాట పట్టిన చైతు..

0
96

సినిమా షూటింగ్ పూర్తైంది.. రిలీజ్ డేట్ మరో మూడు రోజులే ఉంది.. నెక్ట్స్ ఏంటి? ఏముంటుంది ఈ మూడు రోజులూ భీభత్సంగా మూవీని ప్రమోట్ చేసుకోవాలి. ఇంతకీ ఏం సినిమా అనే కదా మీ డౌట్ నాగచైతన్య నటించిన యుద్ధం శరణం మూవీ. ఈనెల 8న రిలీజ్ కాబోతోంది. సోమవారం సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రచార పర్వం మొదలైంది. దీనికి సంబంధించిన ఫుల్ డిటైల్స్‌ను సోషల్ మీడియాలో చైతు పోస్టు చేశారు. ఏ ఏ రోజు ఏ ఊరు వెళ్లనుంది.. అన్ని దానిలో పొందు పరిచారు. దీనిలో భాగంగానే ఇవాళ ఉదయం చైతు వైజాగ్ వెళ్లారు. అక్కడి చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులతో సరదాగా కలవనున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. ఆర్వి మరిముత్తు డైరెక్ట్ చేసిన యుద్ధం శరణం మూవీలో చైతు సరసన లావణ్య త్రిపాఠి నటించింది.