బీజేపీది అక్కడో మాట, ఇక్కడో మాట: వీహెచ్‌

0
70

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ కేంద్ర నేతలు టీఆర్‌ఎస్‌ పాలన బాగుందంటే, రాష్ట్ర నేతలేమో ప్రభుత్వంతో కొట్లాడుతు న్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనపై ద్వంద్వ వైఖరితో ఉన్న బీజేపీ నేతలు.. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనడం హాస్యాస్పదమ న్నారు. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దీనిపై ప్రజాబ్యాలెట్‌ నిర్వహిస్తామన్నారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదన్నారు.