భారత సంతతి జంటకు

0
129

అమెరికా అత్యున్నత అవార్డు
జొహన్నెస్ బర్గ్‌/వాషింగ్టన్‌, అక్టోబరు 25: అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్న భారత సంతతి, దక్షిణాఫ్రికా దంపతులను అమెరికా అత్యున్నత అవార్డు వరించింది. న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్లు సలీమ్‌ అబ్దుల్‌ కరీమ్‌, ఆయన భార్య ఖురేష అబ్దుల్‌ కరీమ్‌ ఎయిడ్స్‌/హెచ్‌ఐవీ రంగంలో చేసిన విశేష పరిశోధనలకుగానూ యూఎ్‌సలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ వైరాలజీ వారికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఎయిడ్స్‌కు కారణం హెచ్‌ఐవీ వైరస్‌ అని కనుగొన్న రాబర్టో గాలో ఈ అవార్డును బుధవారం వారికి అందజేశారు.