ముగ్గురికి ‘రసాయన’ నోబెల్‌

0
177

జికా’ గుట్టు రట్టు చేసిన క్రయో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ ఆవిష్కరణకు పురస్కారం
స్టాక్‌హోమ్‌, అక్టోబరు 4: జీవకణాలను సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేసేందుకు క్రయో ఎలకా్ట్రన్‌ మైక్రోస్కోపీ విధానాన్ని అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2017 సంత్సరానికి నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు. జాక్వెస్‌ డుబోచెట్‌(స్విట్జర్లాండ్‌), జోచిమ్‌ ఫ్రాంక్‌(అమెరికా), రిచర్డ్‌ హెండర్సన్‌(గ్రేట్‌ బ్రిటన్‌)కు సంయుక్తంగా అవార్డును ఇస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం వెల్లడించింది. వీరు రూపొందించిన విధానంతో జీవ కణాలను అత్యధిక రిజల్యూషన్‌తో చిత్రీకరించవచ్చు.

వాటి 3డీ చిత్రాలనూ రూపొందించవచ్చు. క్రయో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీని అభివృద్ధి చేయకముందు కేవలం ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ ద్వారా మృత కణాలను మాత్రమే అధ్యయనం చేసే అవకాశం ఉండేది. కాగా ప్రపంచదేశాలను గడగడలాడించిన జికా వైరస్‌ గుట్టును రట్టు చేయడంలో క్రయో ఎలకా్ట్రన్‌ మైక్రోస్కోపీ కీలకపాత్ర పోషించింది. జికా వైరస్ ను యాంటీబయోటిక్‌ నిరోధకంగా తయారు చేసే ప్రొటీన్లను ఈ విధానం ద్వారానే గుర్తించగలిగారు. అల్జీమర్స్‌కు కారణమయ్యే ఎంజైమ్‌ల 3డీ చిత్రాలను రూపకల్పనలోనూ ఈ విధానం ఉపయోగపడింది.

80వ దశకంలో మొదలైన పరిశోధన
క్రయో ఎలకా్ట్రన్‌ మైక్రోస్కోపీ విధానంపై పరిశోధనలకు 1980ల్లోనే బీజం పడింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లాసన్నేలో బయో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 75 ఏళ్ల డుబొచెట్‌ 1980ల్లో జీవకణాలను వాటి సహజరూపంలో ఘనీభవింప చేసే పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జోచిమ్‌ ఫ్రాంక్‌(77) జీవకణాలను సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేయడం ప్రారంభించారు. కేంబ్రిడ్జిలోని ఎంఆర్‌సీ లాబొరేటరీ ఆఫ్‌ మాలిక్యులర్‌ బయాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హెండర్సన్‌(72) పరమాణుస్థాయిలో ప్రొటీన్‌ 3డీ ఇమేజ్‌లను రూపొందించడంపై పరిశోధనలు చేశారు. వీరి ప్రయత్నాలు 2013 నాటికి ఓ రూపును సంతరించుకున్నాయి