విరాట్‌కు వెన్నుదన్నుగా ధోనీ

0
61

ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ వార్నర్‌
కోల్‌కతా: కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ విజయపథంలో సాగడం వెనుక ధోనీ సహకారం ఎంతో ఉందని ఆస్ర్టేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. అయితే కొన్ని మ్యాచ్‌లు ఓడినపుడు కెప్టెన్‌గా కోహ్లీకి అసలు సవాల్‌ ఎదురవు తుందని చెప్పాడు. ‘ధోనీ.. కోహ్లీలో దూకుడును తగ్గించి ప్రశాంతతను తీసుకువ చ్చాడు. సారథిగా జట్టును అద్భుతంగా నడిపించిన అతడు.. ఇప్పుడు విరాట్‌ను తీర్చిదిద్దడంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాడ’ని వార్నర్‌ ప్రశంసించాడు. ఒక మాజీ కెప్టెన్‌.. ప్రస్తుత నాయకుడికి వెన్నుద న్నుగా నిలవడం ఎంతో గొప్ప విషయమన్నాడు. కానీ కొన్ని వైఫల్యాలు ఎదురైనప్పుడు విరాట్‌ అసలు సత్తా తెలుస్తుందని చెప్పాడు. ‘కెప్టెన్‌గా విరాట్‌కు వైఫల్యాలు తక్కువే. కానీ మ్యాచ్‌లు చేజారుతున్నప్పుడు సారథికి అసలు సవాల్‌ ఎదురవుతుంది. మా చేతిలో ఇంకా మూడు మ్యాచ్‌లున్నాయి. వాటిని నెగ్గగలమనే విశ్వాసం ఉంద’ని డేవిడ్‌ అన్నాడు. అప్పుడు భిన్నమైన విరాట్‌ను చూసే అవకాశం రావొచ్చ న్నాడు. రెండో వన్డేలో టీమిండియాను 252 పరుగులకే కట్టడి చేసినా.. పరాజయం చవిచూడడం నిరాశ కలిగించిందని వార్నర్‌ చెప్పాడు. భువనేశ్వర్‌, బుమ్రా గొప్పగా బౌలింగ్‌ చేశారని కితాబిచ్చాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here