వేతన జీవులు, మధ్యతరగతికి భారీ ఊరట

0
225

ఎన్నికల వేళ మధ్యతరగతికి భారీ ఊరట ఇచ్చేలా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ 2.5 లక్షల రూ 5 లక్షలకు పెంచారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్న వేతన జీవులను బడ్జెట్‌ సంతృప్తిపరిచింది. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ 40 వేల నుంచి 50 వేలకు పెంచారు. ఇక రూ 5 లక్షల వరకూ వార్షికాదయంపై ఎలాంటి పన్ను చెల్లించనవసం లేదు. కాగా,  రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. రూ  10 లక్షల ఆదాయంపై 30 శాతం ఆదాయపన్ను విధిస్తారు

కాగా, మధ్యతరగతితో పాటు నిజాయితీగా పన్ను చెల్లించే వర్గాలకు ఊరటగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపుతో 3 కోట్ల మంది వేతన జీవులు, పింఛన్‌దారులకు ఊరట లభిస్తుంది.