సీబీఐ కోర్టుకు హాజరుకాని వైఎస్ జగన్.. కారణం ఏం చెప్పారంటే.. 0

0
18

సీబీఐ కోర్టుకు హాజరుకాని వైఎస్ జగన్.. కారణం ఏం చెప్పారంటే..

  • సీబీఐ కోర్టులో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌
  •  తదుపరి విచారణ 21కి వాయిదా

ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, విధి నిర్వహణలో నిమగ్నమైన నేపథ్యంలో కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు నేర న్యాయ స్మృతి (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 317కింద ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదేకేసులో రెండో నిందితుడిగా ఉన్న వి.విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, విజయవాడ/తాడేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం ఉన్నందున కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు. వీరిద్దరి పిటిషన్లను న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు అనుమతించారు. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.