సెక్రటేరియట్‌లోకి అడుగు పెట్టాక కీలక ఫైలుపై జగన్ తొలి సంతకం

0
98

సెక్రటేరియట్‌లోకి అడుగు పెట్టాక కీలక ఫైలుపై జగన్ తొలి సంతకం

సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి జగన్‌ చేరుకున్నారు. నేటి ఉదయం 8:30 గంటలకు సీఎం జగన్ సచివాలయంలోని తన చాంబర్‌లో అడుగుపెట్టారు. జగన్‌కు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేశారు.
సచివాలయంలోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం జగన్‌కు వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు. ఆశావర్కర్ల జీతాల పెంపు ఫైలుపై జగన్‌ తొలి సంతకం చేశారు. అనంత ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్టుల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేస్తూ మూడో సంతకం చేశారు.