సైనా లాంటి ప్లేయర్లు ఎక్కడైనా రాణిస్తారు

0
88

బెంగళూరు: సైనా నెహ్వాల్‌ లాంటి ప్లేయర్లు ఏ కోచ్‌ దగ్గరైనా రాణిస్తారని విమల్‌ కుమార్‌ అన్నాడు. అయితే ఆమెకు ట్రైనింగ్‌ ఇచ్చే అవకాశాన్ని మాత్రం తాను మిస్‌ అయినట్టు చెప్పాడు. గోపీచంద్‌ నుంచి విడిపోయిన సైనా.. మూడేళ్లపాటు విమ ల్‌ వద్ద శిక్షణ తీసుకుంది. మళ్లీ ఇప్పుడు గోపీ చెంతకు చేరనుంది. అయితే సైనా.. మళ్లీ తన ట్రైనింగ్‌ బేస్‌ను హైదరాబాద్‌కు మార్చుకునే విషయమై జాతీయ కోచ్‌ గోపీచంద్‌తో కూలంకషంగా చర్చించినట్టు విమల్‌ తెలిపాడు. ‘కుటుంబానికి దూరంగా సైనా ఉండలేక పోతోంది. ఆమె తండ్రి హర్వీర్‌సింగ్‌ ఆరోగ్యం కూడా నెహ్వాల్‌ ఆందోళకు కారణమ’ని చెప్పాడు. సైనా లాంటి ప్లేయర్లు 90 శాతం తమ కష్టంపైనే ఆధారపడతారు. అందుకే ఏ అకాడమీ లేదా ఏ కోచ్‌ వద్ద ఉన్నా వారు రాణిస్తారని అన్నాడు.